Ram shivam movie updates
August 19 2015 at 17:10 241 Shivam Ram Raashi Khanna Devi Sri Prasad Sreenivas Reddy

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'శివమ్'. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పాటల చిత్రీకరణ కోసం ఈ చిత్రబృందం నార్వే ప్రయాణం అయ్యింది. రేపట్నుంచి (20.08.) పాటల చిత్రీకరణ ప్రారంభిస్తారు. నెలాఖరు వరకు నార్వే, స్వీడన్ లలో గల అందమైన పరిసర ప్రాంతాల్లో మూడు పాటలు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రామ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ - ''ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. నార్వే లో వాతావరణం చాలా చల్లగా ఉంది. చల్లటి ప్రదేశంలో రొమాంటిక్ సాంగ్ చేయబోతున్నాను. ఇది హై ఓల్టేజ్ లవ్ స్టోరి. నాది చాలా మంచి పాత్ర. ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు'' అని చెప్పారు.
స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - "కథాబలం ఉన్న చిత్రం ఇది. స్ర్కీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా కుదిరింది. మంచి హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. వచ్చే నెల పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. అక్టోబర్ 2న చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు.
బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్.