TeNF - London - Bathukamma Dasara Celebrations

 October 25 2015 at 9:35   990    Bathukamma Dasara London TeNF UK

TeNF - London - Bathukamma Dasara Celebrations

Telangana NRI Forum ఆధ్వర్యం లో లండన్ లో సద్దుల బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా నిర్వహించాము.

హౌన్‌స్లా లోని లాంప్టొన్ స్కూల్ (Lampton School, Hounslow) ఆడిటోరియం లో జరిగిన ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 1000 - వెయ్యికి పైగా తెలంగాణకుటుంబ సబ్యులు హాజరైయ్యారు.

రంగు రంగుల బతుకమ్మలతో తెలంగాణ ఆడపడుచులు సందడి చేసారు, విదేశాల్లోఉన్నపటికీ సంప్రదాయబద్దం గా పూజలు నిర్వహించి బతుకమ్మ ఆట ప్రారంభించారు,విదేశాల్లో స్థిరపడ్డా కాని తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది, చిన్నారులు సైతం ఆట లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మ ల తో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు…
బతుకమ్మలని నిమ్మజ్జనం చేసి.. తదుపరి సాంప్రదాయ బద్దం గా .సద్దుల ప్రసాదం ఇచ్చపుచ్చుకున్నారు

స్వదేశం నుండి తెచ్చిన
" శమి చెట్టు" కు ప్రత్యేక పూజలు చేసారు.

ఈ సంవత్సరం కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, మన తెలంగాణా ఆడ బిడ్డ, జాగృతీ అద్యక్షురాలు, నిజామాబాద్-ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, రైతులనుఆడుకోవాలనే సంకల్పం తో ఇచ్చిన పిలుపు మేరకు "అడాప్ట్ ఏ ఫార్మర్"(Adopt a Farmer) కార్యక్రమానికి మదత్తుగా… ప్రత్యేక స్టాల్ ని ఏర్పాటు చేసి, హాజరైన అతిదులకు… రాష్ట్రం లో , రైతులకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం, ముక్యంగా కవిత గారు చేస్తున్న కార్యక్రమాలని వివరించడం జరిగింది .

అలాగే బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా, నాటి ఉద్యమం నుండి నేటి పునర్నిర్మాణం వరకు అన్నింట్లో ముందున్న ఎన్నారై ఫోరమ్, రైతల సహాయార్ధం, వేడుకల్లో సమకూరిన మొతాన్ని కవిత గారికి అందజేస్తునట్టు తెలిపారు. హాజరైన ప్రవాస బిడ్డలు, రైతుల పట్ల సంస్థ బాద్యతను ప్రశంసించారు.

భారత హై కమీషన్ ప్రతినిది విజయ్ వసంతన్, బ్రిటన్ లోని పలువురు ఎం.పీ లు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రుత్ కాడ్బరీ, స్థానికి కౌన్సిలర్ ప్రీతం మరియు ఇతర ప్రవాస భారత సంఘాల ప్రతినితులు, వేడుకలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

హాజరైన ఆతిథులు, సంస్థ చేసిన గొప్ప సాంస్కృతిక సంబరం ఎంతో స్పూర్తినిచిందని, విదేశీ గడ్డ పై ఇంత ఘనంగా బారతీయ సంస్కృతిని, ముక్యంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్ర సాంకృతిని ప్రపంచానికి చాటుతున్న తీరు గొప్పగా ఉందని ప్రశంసించారు.

ఆతిథులు గా వచ్చిన స్థానికి మహిళా ఎంపీ లు ప్రవాస తెలంగాణా బిడ్డల తో కలిసి బతుకమ్మ - కోలాటం ఆడి, సందడి చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు .

తెలంగాణా ఎన్నారై ఫోరమ్ సంస్థ కొన్ని రోజుల ముందు నిర్వహించిన చారిటీ క్రికెట్ మరియు వాలీ బాల్ టోర్నమెంట్ విజేతలకు, ఆతిథులు బహుమతులు అందించారు.

ఉత్తమ బతుకమ్మ లకు బహుమతులు అందజేశారు ప్రధమ బహుమతి - లయా రూపేష్ , ద్వితీయ – స్వప్న, మరియు తృతీయ - మీనాక్షి అంతటి అవార్డు గెలుచుకున్న వారిలో ఉన్నారు.

రాఫెల్ లో బంగారు బహుమతులు గెల్చుకున్నవారిలో ప్రధమ - రాజు , ద్వితీయ - అన్వేష్, తృతీయ - గోపి ఉన్నారు.

తెలంగాణ కుటుంబాలు ఇలా ఒక్క దగ్గర కలుసుకొని పండగ జరుపుకోవడం చాల సంతోషం గా ఉందని హాజరైన వారందరూ అభిప్రాయపడ్డారు.

అద్యక్షులు సిక్క చందు గౌడ్, ఉపాద్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ఇవెంట్స్ ఇన్‌ఛార్జ్ నగేష్ రెడ్డికాసర్ల ఆద్వర్యం లో జరిగిన వేడుకల్లో TeNF -వ్యవస్థాపక సబ్యులు - ఎన్నారై టి. ఆర్. యస్ సెల్అద్యక్షులు అనిల్ కూర్మాచలం, అడ్వైసరీ బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నాగరాజు, ప్రదానకార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు - సుధాకర్ గౌడ్ & రత్నాకర్ కడు దుల,అడ్వైసరీ బోర్డ్ సబ్యులు ప్రమోద్ అంతటి, కోశాధికారి అశోక్ గౌడ్ దూసారి & వెంకట్ రెడ్డి,మహిళా విభాఘం ఇన్‌ఛార్జ్ సుమా దేవి, సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ అర్చన జువ్వాడి, స్పోర్ట్స్ఇన్‌ఛార్జ్ నవీన్ రెడ్డి, నరేశ్ కుమార్, మీడీయ సెక్రెటరీ మల్లా రెడ్డి, కల్చరల్ కో ఆర్డినేటర్ సుష్మణ రెడ్డి , స్వాతి ,మీనాక్షి, నిర్మల, శౌరి, స్వప్న ఇవెంట్ కమిటీ సబ్యులు మంద సునీల్ రెడ్డి, శివాజీ షిండే, రేకుల విక్రమ్ రెడ్డి, రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్ల, వంశీ చిట్టి, స్వామి ఆశ, సత్యం కంది, సునీల్,మహేష్ , రంగు వెంకట్, వాణి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Related articles