TRS - MLA Ganesh Gupta Bigala Visit to UK Parliament

 May 24 2016 at 7:19   614    TRS Nizamabad MLA Ganesh Gupta Bigala UK Parliament

TRS - MLA Ganesh Gupta Bigala Visit to UK Parliament

బ్రిటన్ పార్లమెంట్ ను సందర్శించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మల్యే గణేశ్ బిగాల  !!

నిజామాబాద్ అర్బన్ ఎమ్మల్యే గణేశ్ బిగాల  గారు, తన వ్యక్తిగత పర్యటన లో బాగంగా బ్రిటన్ లోని లండన్ నగరం ను సందర్శించారు . ఈ పర్యటన లో బాగంగా నేడు బ్రిటన్ లోని భారత సంతతి కి చెందిన ఎంపీ మరియు అఖిలపక్ష ఇండో - బ్రిటన్ ఎంపీల  ఛైర్మన్  వీరేంద్ర శర్మ (Indo-British All Party Parliamentary Group (APPG) Chairman) గారి  ఆహ్వానం మేరకు  పార్లమెంట్ ను సందర్శించారు.

ముందుగా శర్మ గారు, పార్లమెంట్ లోని వివిధ విభాగాలకు దగ్గరుండి చూపించి వాటి చరిత్రను వివరించారు, తరువాత బ్రిటన్ రాజకీయ వ్యవస్థ - పరిపాలన విదానాల గురించి వివరించారు.  

ఎమ్మల్యే గణేశ్ బిగాల గారు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్ర అభివృద్ది, ముఖ్యంగా ముఖ్యమంత్రి కే. సీ. ఆర్ గారి విజన్ గురించి వివరించారు. ఇటీవల రాష్ట్రం సాదించిన విజయాల గురించి తెలిపారు. 

వీరేంద్ర శర్మ గారు స్పందిస్తూ, తాను తెలంగాణా రాష్ట్రం గురించి వింటునానని, ఇటీవల ఆపిల్ సంస్థ తన డెవెలప్‌మెంట్ సెంటర్ హైద్రాబాద్ లో పెట్టిన విషయం గుర్తు చేస్తూ, కే. సీ. ఆర్ గారిని ప్రసంశ ల తో ముంచేశారు.  చివరిగా, వీరేంద్ర శర్మ గారిని తెలంగాణా రాష్ట్రానికి రావాల్సిందిగా ఎమ్మల్యే గణేశ్ బిగాల గారు ఆహ్వానించారు.

ఈ సందర్శనలో ఎమ్మెలే గణేశ్ బిగాల తో పాటు, వారి సోదరుడు మహేష్ బిగలా, ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ అద్యక్షుడు అనిల్ కూర్మాచలం, తెలంగాణా ఎన్నారై ఫోరం - హెడ్ ఆఫ్ అడ్వైసరీ బోర్డ్ ఉదయ్ నాగరాజు, ఎన్నారై టి. ఆర్. యస్ సెల్  సెక్రెటరీ నవీన్ రెడ్డి మరియు ఎమ్మల్యే కుటుంబ సబ్యులు హాజరైన వారిలో ఉన్నారు.  

Related articles